తులసిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
రోగుల సంరక్షణ వార్డ్ షెడ్
ఇన్‌పేషెంట్ సదుపాయాల ప్రారంభం

న్యూస్ తెలుగు/ చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తులసీపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన రోగుల సంరక్షణ వార్డ్ షెడ్, ఐదు ఇన్‌పేషెంట్ పడకలు, 4స్టాండ్లను శనివారం చింతూరు ఐ టి డి పి ఓ అపూర్వ భరత్ ప్రారంభించారు. దీంతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగు వేయబడింది. ఈ అత్యవసర ఆరోగ్య సదుపాయాన్ని సుకుమార్, శ్రీమతి రమ, హైదరాబాదులోని క్యూబ్ వైస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సంస్థ మ్యానేజింగ్ డైరెక్టర్లు, దాతృత్వంగా అందించారు. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘సమారిటన్స్ – ఫర్ ద నేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ సమన్వయం చేసి, విజయవంతంగా అమలు చేసింది. ఈ సంస్థ పలుచోట్ల ప్రజారోగ్య రంగానికి విలువైన సేవలందిస్తోంది.ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 3 లక్షలుగా అంచనా వేయబడింది. ఇందులో వార్డ్ షెడ్ నిర్మాణం, ఐదు ఇన్‌పేషెంట్ పడకలు, 4 స్టాండ్ల కొనుగోలు వంటి ముఖ్యమైన సదుపాయాలు ఉన్నాయి, ఇవి అత్యవసర చికిత్సల నిమిత్తం చాలా అవసరం. (Story:తులసిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)

