Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అమరుల త్యాగాలతో పేద ప్రజల కొరకు సాగిన 100 సం ల భారత కమ్యూనిస్టు ఉద్యమం

అమరుల త్యాగాలతో పేద ప్రజల కొరకు సాగిన 100 సం ల భారత కమ్యూనిస్టు ఉద్యమం

0

అమరుల త్యాగాలతో పేద ప్రజల కొరకు సాగిన 100 సం ల భారత కమ్యూనిస్టు ఉద్యమం

జూలై 14,15 తేదీలలో సిపిఐ పల్నాడు జిల్లా మహాసభలు వినుకొండలో

మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి

న్యూస్ తెలుగు/వినుకొండ  : భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఎందరో అమరవీరులు ప్రజల కోసం తమ విలువైన ప్రాణాలను బలిదానం చేసిన చరిత్ర ఎర్రజెండాదని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ఒకటో వార్డు వెన్నపూస కాలనీలో శుక్రవారం జరిగిన శాఖా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అట్టడుగు వర్గాలు దళిత బలహీన వర్గాల అభ్యున్నతికి కార్మిక కర్షక వర్గాల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిందన్నారు. సెంటు, కుంట,లేని నిరుపేద ప్రజలకు, రైతులు రైతు కూలీలకు, లక్షలాది ఎకరాలు పడావుగా పడి ఉన్న ప్రభుత్వ బంజరు, భూములను ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిందని, రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరకై రైతు సంఘాలతో అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ గానీ ఇవ్వకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిని దెబ్బతీసి ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మోడీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకొని నిర్మించ తలపెట్టిన వివిధ సంస్థ లకు శంకుస్థాపనలు చేశారు కానీ కేంద్రం నుండి రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఏమాత్రం ప్రకటించలేదని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానన్న నరేంద్ర మోడీ ధరలు విపరీతంగా పెంచారని పెట్రోలు, డీజీలు, గ్యాస్ తో నిత్యావసర సరుకుల ధరలను కూడా అడ్డగోలుగా పెంచారని ఆయన తీవ్రంగా విమర్శించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము లు మాట్లాడుతూఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లను అర్హులైన వారికి వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.సిపిఐ జాతీయ మహాసభల షెడ్యూల్ ప్రకటించినందున దేశంలోని పార్టీ గ్రామీణ శాఖల నుండి మండల పట్టణ నియోజకవర్గ జిల్లా రాష్ట్ర మహాసభలన్నీ నిర్వహించుకోవలసి ఉన్నదని అందులో భాగంగానే ఈ శాఖ సమావేశం జరుగుతోందని అన్నారు. పార్టీ శాఖలను నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ గ్రామ, వార్డులలో ఉన్నటువంటి సమస్యలను సమావేశాల్లో చర్చించి పరిష్కరించుటకు తీర్మానాలు చేసి పరిష్కారం కొరకు పోరాటం చేసి పరిష్కరించాలని ఆయన కార్యకర్తలకు తెలిపారు. సమావేశానికి నలబోతు శ్రీను అధ్యక్షత వహించగా కార్యక్రమం లో ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, మండల కార్యదర్శి రాయబారం వందనం, పిన్ని బోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, తిరుమల కోటిలింగం, కోటి తిరుమల తిరుపాలు గాదం రంగయ్య తిరుమల, దిబ్బమ్మ నలబోతు బుజ్జమ్మ, మరియమ్మ, యోగమ్మ, రంగమ్మ, కుమారి ,గురవమ్మ మార్కు, నాగమణి, పద్మ, భూషయ్య, రాజేశ్వరి, భూలక్ష్మి, కనకమ్మ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మహాసభ నూతన కమిటీని ఎన్నుకున్నది కార్యదర్శిగా-నల్లబోతు శ్రీనివాసరావు సహాయ కార్యదర్శులు గా తిరుమల శ్రీను, నల్లబోతు రంగయ్య, తిరుమల హనుమాయమ్మ, తిరుమల రూతమ్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.(Story : అమరుల త్యాగాలతో పేద ప్రజల కొరకు సాగిన 100 సం ల భారత కమ్యూనిస్టు ఉద్యమం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version