Home వార్తలు  ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ కొత్త బ్యానర్ లోగో ఆవిష్కరణ

 ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ కొత్త బ్యానర్ లోగో ఆవిష్కరణ

0

 ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ కొత్త బ్యానర్ లోగో ఆవిష్కరణ

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ ప్రపంచ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే అందరి దృష్టి పడుతోంది. ఇలాంటి టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ వచ్చింది. ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ అంటూ ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ రాబోతోంది. గురువారం నాడు ఈ కొత్త బ్యానర్ లోగోని లాంచ్ చేశారు. అనంతరం ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్ అధినేత జేజే మీడియాతో ముచ్చటించారు. ఆయన ఏం చెప్పారంటే..
‘టాలీవుడ్‌లోకి నిర్మాతగా వస్తుండటం ఆనందంగా ఉంది. మా లాంటి కొత్త వారిని టాలీవుడ్ ఎంతో ఘనంగా స్వాగతిస్తోంది. ఇక్కడి పెద్దలు మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్‌లో మా సంస్థను రిజిస్టర్ చేశాం. మాకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా సహకారం లభించింది. మా సంస్థ లోగోను నేడు ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. మా సంస్థ లోగోలో చూపించినట్టుగా ఆ వెలుగుని అంతటా పంచాలని ఆశిస్తున్నాం.
పరిశ్రమలో పరస్పర సహకారం, ఎదుగుదల అనే కాన్సెప్ట్‌తో ఆ లోగోను డిజైన్ చేయించాం. ఇక్కడ మేం కొత్త వారిని ఎంకరేజ్ చేయడానికి, కొత్త కథల్ని తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తాం. మా ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌పై త్వరలో ఒక భారీ సినిమా ప్రారంభం కానుంది. భవిష్యత్తులో ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలన్నదే మా లక్ష్యం’ అని తెలిపారు. (Story: ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ కొత్త బ్యానర్ లోగో ఆవిష్కరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version