గ్రంథాలయాలతోనే బాలల వికాసం
న్యూస్‌తెలుగు/విజయనగరం : గ్రంధాలయాలు బాలల వికాసానికి తోల్పడతాయని విజయనగరం జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బి లక్ష్మీ పేర్కొన్నారు .ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు . ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పంచాయతీ స్థాయిలోనూ విద్యార్థులకు అందుబాటులో గ్రంథాలయం ఉండాలన్నారు. పిల్లలను కూర్చోబెట్టి పైకి వినిపించేలా పుస్తక పఠనం చేయిస్తే భాషా ఉచ్చారణ, పఠన సామర్థ్యము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని ఈ విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలని సూచించారు .కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీలలో ఆసక్తిగా పాల్గొని భారతదేశ చరిత్రతో పాటు ,జిల్లాస్థాయి అంశాల పైన విద్యార్థులు ఎంతో హుషారుగా సమాధానాలు చెప్పారు .విజేతలకు పుస్తకాలను ,పతకాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మేకా అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అనంతలక్ష్మి , ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి సుభద్ర దేవి,మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, సంఘం సలహాదారు కంచర్ల రాజేశ్వరరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (Story:గ్రంథాలయాలతోనే బాలల వికాసం)

