Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలతో చెలగాటమాడుతున్న గవర్నమెంట్ డాక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలతో చెలగాటమాడుతున్న గవర్నమెంట్ డాక్టర్

0

ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలతో చెలగాటమాడుతున్న గవర్నమెంట్ డాక్టర్

న్యూస్ తెలుగు/వినుకొండ  : సరికొండ పాలెం గ్రామానికి చెందిన ఒంగోలు రాజారావు, మొక్కలపాడు గ్రామానికి చెందిన అన్నా సుబ్బారావు. దంపతులు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకోవడం కోసం బుధవారం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి వస్తే ప్రభుత్వాసుపత్రిలో పేషెంట్లు పట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పేషెంట్ కి ఆపరేషన్ ముందు మత్తు ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేయాలి. కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు ఇమ్మా చేయకుండా మత్తిచ్చి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన తర్వాత డాక్టర్ సమయం అయిపోయినదని మత్తు ఇచ్చినటువంటి పేషెంట్లకు ఆపరేషన్ చేయకుండా వెనక్కి పంపించారని, ఈ విషయాన్ని సిపిఐ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చి బాజీలు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ నియోజకవర్గ సమితి నాయకులు బూదాల శ్రీనివాసరావు, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, సోమవరపు దావీదు, తదితరులు పేషెంట్లను తీసుకొని హాస్పటల్ మెడికల్ ఆఫీసర్ అయిన శ్రీనివాస్ రెడ్డి ని ప్రశ్నించగా, శ్రీనివాస్ రెడ్డి ఈ విషయం మాకు తెలియదు మేము వారిని వెంటనే పిలిపించి మాట్లాడి ఇది పురావతం కాకుండా చేస్తామని మాట ఇవ్వటం జరిగింది. దీనిపై సిపిఐ నాయకులు మాట్లాడుతూ. “పేదవారు డబ్బిచ్చి ప్రైవేట్ హాస్పిటల్ కి పోయి వైద్యం చేపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులకు వచ్చి వైద్యం చేపించుకుందామని ఆశలతో వస్తే డాక్టర్లు పేదవాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ హాస్పటల్లో చేరిన పేషంట్లను చులకన భావనగా చూస్తూ సరైన వైద్యం అందించకుండా హాస్పటల్లో ఉంటున్న పేదలపై నిర్లక్ష్యం వహించటం దారుణమన్నారు. ఇది గనక పునరావృతం అయితే నియోజకవర్గంలో ఉన్న పేదలందరిని ఐక్యం చేసి ప్రభుత్వ ఆసుపత్రి మీద ధర్నా చేస్తామని ఈ సందర్భంగా బూదాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఈ సమస్యపై మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి కి సిపిఐ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.(Story : ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలతో చెలగాటమాడుతున్న గవర్నమెంట్ డాక్టర్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version