Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కొనసాగుతున్న యోగ మాసోత్సవాలు..

కొనసాగుతున్న యోగ మాసోత్సవాలు..

0

కొనసాగుతున్న యోగ మాసోత్సవాలు..

న్యూస్ తెలుగు/ వినుకొండ : కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ మరియు చిఫ్ విప్ జీవి ఆంజనేయులు సూచనల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రాంగణం నందు మంగళవారం జరిగిన యోగ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. యోగా భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇందులో పలు యోగాసనాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా శ్వాస కోస సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజులు ఇమిడి ఉంటాయన్నారు. ధ్యానం, శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతతా చేకూరుతుంది. ఒక యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా, ఉన్నతులుగా మారొచ్చని ప్రాచీన యోగ శాస్త్రాలు చెబుతున్నాయని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి షకీలా దస్తగిరి మాట్లాడుతూ. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల అకారణంగా మనం ఎదుటి వారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని మనసులో నింపుకోకుండా ఉంటాం. దీంతో మనకు మనమే చాలా ఆరోగ్యంగా ఉంటాం అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్. ఇస్మాయిల్ , బిజెపి పట్టణ అధ్యక్షులు మేడం రమేష్, యోగా గురువులు, మున్సిపల్ సిబ్బంది మరియు యోగా సాధకులు, మరియు వాకర్స్ పాల్గొన్నారు . (Story:కొనసాగుతున్న యోగ మాసోత్సవాలు..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version