ప్రజల వద్దకు వెళ్ళండి ప్రజా సమస్యలపై ఉద్యమించండి ;
కమ్యూనిస్టు పార్టీకి శాఖ నిర్మాణం గుండెకాయ లాంటిది
సిపిఐ క్వారీ శాఖ మహాసభలో అక్కినేని వనజ పిలుపు
న్యూస్ తెలుగు/చింతూరు : రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని ప్రజల వద్దకు ప్రతి కార్యకర్త కు వెళ్లి వారి సమస్యలను అధ్యయనం చేసి వారి సమస్య పరిష్కారానికి పోరాటాలు చేస్తే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం బలోపేతం అవుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు.సోమవారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్లో సిపిఐ క్వారీ ఏరియా శాఖ మహాసభ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించడం జరిగింది . ఈ బహిరంగ సభకు శాఖ కార్యదర్శి
టీ నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా అక్కినేని వనజ ముఖ్యం గా పాల్గొని ప్రసంగించారు.
దేశంలో మోడీ అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఆగ్రహం పెరుగుతుందని మరోపక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో ప్రజల్లో అసంతృప్తి ఉందని ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తే ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు గుర్తిస్తారని ఆమె అన్నారు.ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాల కోసం కమ్యూనిస్టు పార్టీ అలుపెరగని ఉద్యమాలు నిర్వహించిందన్నారు.
కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి శాఖ గుండెకాయ లాంటిదని ఆమె తెలిపారు. మహాసభలు సందర్భంగా ఇంటింట సిపిఐ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇంకా ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జిల్లా సహాయ కార్యదర్శి
కే రాంబాబు జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య కె శ్రీనువాస్ పి త్రిమూర్తులు సీపీఐ స్థానిక ఆర్గనమ్మ శంకురమ్మ అప్పయ్యమ్మ సుజానమ్మ తదితరులు ప్రసంగించారు.(Story : ప్రజల వద్దకు వెళ్ళండి ప్రజా సమస్యలపై ఉద్యమించండి ; )

