ప్లాస్టిక్ నిషేధం పై ప్రజల్లో అవగాహన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పుట్టారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నుండి అన్ని గ్రామ పంచాయతీల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, అది మన బాధ్యత అని, కాలుష్యాన్ని అరికట్టి భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సుందర్ రెడ్డి, ఏవో వెంకట రవి, స్వచ్ఛభారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ పచ్చిగోళ్ళ ప్రభాకర్ రావు, ఏ పి ఓ కట్ట నాగేశ్వరరావు, నడిగడ్డ మాజీ సర్పంచి గోవిందరాజులు, వీరాంజనేయులు, వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.(Story : ప్లాస్టిక్ నిషేధం పై ప్రజల్లో అవగాహన )

