కలకలం: విశాఖలో తొలి కరోనా కేసు
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసు కలకలం సృష్టిస్తోంది. విశాఖ మహానగరంలో ఈ కేసు నమోదు కావడం సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. గతంలో వచ్చిన కరోనాతో అనేక మంది ప్రాణాలు విడిచారు. అనారోగ్యాల పాలయ్యారు. వ్యాపారస్తులు ఆర్థికంగా చితికిపోయారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. ఈ సమయంలో మళ్లీ కరోనా రావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాని ప్రభావంతో ..ఎట్టకేలకు విస్తరించి..ఏపీలోని విశాఖలో తొలి కరోనా కేసు బయటపడింది. 28ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. ఈ సమాచారం తెలుసుకోవడంతో వైద్యారోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో నివాసముంటున్న 28 ఏళ్ల మహిళ కొద్దిరోజుల క్రితం జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడిరది. మందులు వాడుతున్నప్పటికీ.. తగ్గకపోయేసరికి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య సేవలు అందిస్తూ శాంపిళ్లు సేకరించి ర్యాపిడ్ టెస్ట్ చేశారు. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు కొన్ని శాంపిళ్లను పంపారు. అక్కడనూ కరోనా నిర్ధారణ జరగడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి.. హోం క్వారాంటైన్‌లో ఉండాలని సూచించారు. విశాఖలో తొలి కేసు నమోదు కావడంతో నాలుగు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు మహిళ నివాసముంటున్న పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. మహిళ కుటుంబ సభ్యుల శాంపిళ్లను సేకరించారు. మహిళకు తప్ప ఇంకెవరికి అటువంటి లక్షణాలు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రజలందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. ఈ కేసు నమోదుతో ప్రజలంతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , జన సమర్థం ఉన్న ప్రదేశాల్లో వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉంటే.. వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అధికారులకు ప్రత్యేక సూచనలు చేసిన హెల్త్ డైరెక్టర్.. మాస్కులు, పీపీఈ కిట్లు, అందుబాటులో ఉంచాలి. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధమైంది. విశాఖలో తొలి కరోనా కేసు నమోదైన సంఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు తెలిసింది. (Story: కలకలం: విశాఖలో తొలి కరోనా కేసు)

