Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ క‌రెంట్ క‌ట్ః విద్యుత్ ఏడీఈని నిర్బంధించిన జ‌నం

క‌రెంట్ క‌ట్ః విద్యుత్ ఏడీఈని నిర్బంధించిన జ‌నం

0

క‌రెంట్ క‌ట్ః విద్యుత్ ఏడీఈని నిర్బంధించిన జ‌నం

సాలూరు ప‌ట్ట‌ణంలో మ‌హిళ‌ల నిర‌స‌న‌
శ్యామ‌లాంబ జాత‌ర‌కు క‌రెంటు దెబ్బ‌
మూడు రోజులుగా చీక‌ట్లోనే సాలూరు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు

న్యూస్ తెలుగు/సాలూరుః శ్యామ‌లాంబ తిరునాళ్లు చీక‌ట్లో జ‌రుపుకునే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ‌త మూడు రోజులుగా సాలూరు ప‌ట్ట‌ణంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే జ‌నం తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనై, ఏకంగా విద్యుత్ శాఖ‌ అధికారిని నిర్బంధించి, త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. గత మూడు రోజులుగా సాలూరు పట్టణంలో విద్యుత్ లేకపోవడంతో నిర‌స‌న తెలియ‌జేసిన సాలూరు ప్ర‌జ‌లు బుధ‌వారంనాడు ఎలక్ట్రికల్ ఏడీఇ రంగారావును నిర్బంధించారు. దీంతో సాలూరు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అంతేగాకుండా, రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. మహిళలు, ప్రజలు కొవ్వొత్తులతో నిరసన తెలియ చేశారు. సాలూరు శ్యామలాంబ ఉత్స‌వాల‌ సందర్భంగా గత మూడు రోజులుగా పట్టణంలో ఉన్న ప్రధాని వీధులు అక్కిన వీధి, అల్లు వీధి, మజ్జుల, జన్ని వీధి, కరెంటు, గొల్లవీధి లేకపోవడంతో ప్రజలు ఆగ్రహించి, రోడ్డుపై వచ్చి ధర్నాలు, రాస్తారోకో చేశారు. స్థానిక మంత్రి ఇంటిని కూడా నిర్బంధిస్తామ‌ని హెచ్చ‌రించారు. క‌రెంటు వ‌చ్చేదాకా విద్యుత్ శాఖాధికారిని విడిచిపెట్టేది లేద‌ని మ‌హిళ‌లు ప్ర‌క‌టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.(Story:క‌రెంట్ క‌ట్ః విద్యుత్ ఏడీఈని నిర్బంధించిన జ‌నం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version