Home వార్తలు జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’

జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’

0

జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. మొదటి సీజన్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనతో రెండో సీజన్‌ను అంతకు మించి అనేలా రూపొందించారు. ఇక ఈ రెండో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియా యొక్క బ్రేక్అవుట్ హిట్‌లలో ఒకటిగా మారిన ఈ సిరీస్ ప్రస్తుతం రెండో సీజన్‌తో ఆడియెన్స్ ముందుకు రానుంది. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేశారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. ‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి అద్భుతమైన తారాగణంతో ఈ ‘రానా నాయుడు’ సీజన్ 2 రాబోతోంది. జూన్ 13న ‘రానా నాయుడు 2’ని కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే చూడండి.

నటీనటులు : రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బంధ, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా తదితరులు

టెక్నికల్ టీం
క్రియేటర్ : కరణ్ అన్షుమాన్
దర్శకుడు: కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా
రచయిత : కరణ్ అన్షుమాన్, ర్యాన్ సోరెస్, కర్మణ్య అహుజా, అనన్య మోడీ, కరణ్ గౌర్, వైభవ్ విశాల్
నిర్మాత : సుందర్ ఆరోన్
నిర్మాణ సంస్థ : లోకోమోటివ్ గ్లోబల్ మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విశాల్ బజాజ్, నిశాంత్ పాండే, ఆరిఫ్ మీర్ (Story:జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version