ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు
న్యూస్ తెలుగు /వినుకొండ : ఎన్టీఆర్ 102 వ జయంతిని పురస్కరించుకొని నందమూరి తారక రామారావు కళాపరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన నాటిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పట్టణంలోని జూనియర్ కళాశాలలో తొలిరోజు సోమవారం ముప్పాళ్ళ చెన్నయ్య, రాపర్ల శ్రీనివాసరావు కళాప్రాంగణం లో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ జి లీలావతి జ్యోతి ప్రజ్వలన చేయగా, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు నటరాజ పూజ చేసి ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. నాటిక ప్రదర్శనలకు డిఎల్డిఏ మాజీ చైర్మన్ లగడపాటి వెంకట్రావు, న్యాయవాది ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్రావు, వారి కుటుంబ సభ్యులకు ప్రోత్సాహిక పారితోషికాన్ని అందజేశారు. సందేశాత్మకంగా భార్య మాటలు విని కన్న ప్రేమను మరిచిన కొడుక్కి కళ్ళు జరిపించిన తల్లిదండ్రుల ఇతివృత్తంగా “కిడ్నాప్” నాటిక సాగింది. ఉషోదయ కళానికేతన్ కాట్రపాడు కు చెందిన కళాకారులు పోటీపడి నటించారు. చెరుకూరి సాంబశివరావు దర్శకత్వం వహించారు. కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో “జనరల్ బోగీలు” నాటిక రైళ్లలో సామాన్య ప్రయాణికులు కష్టాలను కళ్ళకు కట్టింది. మాధవ్ రచించిన గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ముత్తినేని గిరిబాబు, బొల్లా వెంకట కోటయ్య, జ్ఞానేశ్వరరావు, రామకోటేశ్వరరావు, కౌన్సిలర్ షకీలా బేగం, పీవీ. సురేష్ బాబు, జనసేన పార్టీ నాగ శ్రీను రాయల్, మంద. మరియదాసు, గాలి. రేవతి శ్రీనివాసరావు, పెనుగొండ. శ్రీనివాసరావు, లాయర్. సైదారావు, తదితరులు పాల్గొన్నారు . (Story:ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు)

