Home వార్తలు తెలంగాణ వర్తమాన రాజకీయాలపై సదస్సును విజయవంతం చేయాలి

వర్తమాన రాజకీయాలపై సదస్సును విజయవంతం చేయాలి

0

వర్తమాన రాజకీయాలపై సదస్సును విజయవంతం చేయాలి

న్యూస్ తెలుగు/వనపర్తి  : దేశంలో వర్తమాన రాజకీయాలపై ఈనెల 25 సాయంత్రం నాలుగు గంటలకు వనపర్తి లక్ష్మీనరసింహ కాలనీ జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆఫీస్ లో విశ్లేషణాత్మక అవగాహన సదస్సు జరుగుతుందని ప్రజా సంఘాల నేతలు వెల్లడించారు. సోమవారం వనపర్తి సిపిఐ ఆఫీస్ లో అవగాహన సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. ప్రముఖ కవి జనజ్వాల, తెలంగాణ రైతు సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొంకల వెంకట్ నారాయణ, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు సిపిఐ జిల్లా నేత గోపాలకృష్ణ మాట్లాడారు. ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రముఖ కవి జన జ్వాల రాధాకృష్ణ అన్నారు.ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రైతు సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య కోరారు. తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ఆపాలని ఆదివాసీల హక్కులను కాపాడాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొంకల వెంకట్ నారాయణ అన్నారు. ఆదివాసీలపై ఆకృత్యాలను ఆపాలని, కర్రి గుట్టల నుంచి పోలీసు బలగాలని ఉపసంహరించాలని, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సిపిఐ జిల్లా నేత గోపాలకృష్ణ కోరారు. 25న జరగనున్న వర్తమాన రాజకీయాలపై అవగాహన సదస్సులో ప్రసంగించేందుకు ప్రధాన వక్తగాడా.MF గోపీనాథ్ హాజరవుతున్నారని జిల్లాలోని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ సెల్ జిల్లా కమిటీ సభ్యుడుగంధం నాగరాజు, యుటిఎఫ్ నేత సురేష్, అంబేద్కర్ యువజన సంఘం నేత మందకృష్ణ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.(Story : వర్తమాన రాజకీయాలపై సదస్సును విజయవంతం చేయాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version