ఘనంగా తొలెళ్ళు ఉత్సవం
న్యూస్ తెలుగు/సాలూరు : శ్యామలాంబ అమ్మవారి పండుగ తొలెళ్ళు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం పట్టణంలో గల పెద కోమటి పేట అమ్మవారి గద్దె వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఆనవాయితీగా వస్తున్న మొదట అక్కేన వీధి కి చెందిన భక్తులు పూజు, పలుపులు పట్టుకొని తిరగడం ప్రారంభించారు. తర్వాత గొల్లవీధి, డబ్బి వీధి, మెంటాడ వీధి ల నుండి వచ్చిన భక్తులు ఈ తొలెళ్లు కార్యక్రమం లో పూజ పట్టుకొని తిరిగారు. ఈ కార్యక్రమానికి సాలూరు యువరాజు విక్రమచంద్ర సన్యాసిరాజు మొదట పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్, ఆలయ కమిటీ చైర్మన్ అక్యాన అప్పారావు, పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సజావుగా జరగడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. (Story:ఘనంగా తొలెళ్ళు ఉత్సవం )

