మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : భూ కబ్జాలకు పాల్పడ్డ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి డిమాండ్ చేశారు. తాను కబ్జాలకు పాల్పడలేదని ఎన్నికల ముందు నిరూపించాలని సవాల్ విసిరిన మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా, మనోపాడు మండలం, చందూర్ గ్రామంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బినామీల పేర్ల పై సర్వే నెంబర్ 57 లోని రెండు ఎకరాల 19 గుంటలు భూమి భూ ఖబ్జా నిజమేనని నిర్ధారణ కావడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సేవ్ వనపర్తి – చేంజ్ వనపర్తి నినాదంతో ఆత్మగౌరవం కాపాడుకునేందుకు తనకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి, భూకబ్జాలను నిరూపించడంలో భాగంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేశానని, తన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గద్వాల్ జిల్లా కలెక్టర్ సూచనతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారన్నారు.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన పై వ్యక్తిగత దూషణలకు దిగిన తాను ఎన్నడూ ఎదుటి వ్యక్తి పై వ్యక్తిగత దూషణలకు దిగలేదని స్పష్టం చేశారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పై తానే చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఐటీ హబ్ నిర్మాణం కోసం నిధుల ఉత్తర్వులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని తాను తీసుకొని వచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంకు రూ.22,400 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి చుక్క నీరు అందలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంబై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు తాను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి 2700 కోట్లు విడుదల చేయిస్తాను చేదాదాపు 16 నెలల కాంగ్రెస్ ప్రజాపాలనలో వనపర్తి నియోజకవర్గానికి 1000 కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించానని గుర్తు చేశారు. భవిష్యత్తులో వనపర్తి నియోజకవర్గంలో సాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.12 లక్షల కోట్ల రూపాయలతో చెరువులు పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నివేదికలను సిద్ధం చేస్తున్నామన్నారు. వనపర్తి జిల్లాలో రబీ సీజన్ లో రికార్డు స్థాయిలో 3 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతులు పండించారన్నారు. బీఆర్ఎస్ నాయకులు కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైతుల పై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అవినీతి లేని అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు శంకర్ ప్రసాద్, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.(Story : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి )

