Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వినుకొండలో నాటకోత్సవాలు

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వినుకొండలో నాటకోత్సవాలు

0

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వినుకొండలో నాటకోత్సవాలు

నాటకోత్సవాలు, వజ్రోత్సవ వేడుకల కరపత్రాలు ఆవిష్కరించిన జీవీ దంపతులు, మక్కెన

న్యూస్ తెలుగు /వినుకొండ : మహానటుడు, తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురష్కరించుకుని వినుకొండలో నాటకోత్సవాలు నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నందమూరి తారక రామారావు కళా పరిషత్ కార్యవర్గం ఆధ్వర్యంలో వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3 రోజులపాటు నాటకోత్సవాలు, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్న జీవీ ఆదివా రం ఈమేరకు సతీసమేతంగా… నాటకోత్సవాలు, వజ్రోత్సవ వేడుకల కర పత్రాలు ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంది అవార్డులు పొందిన చక్కటి నాటికలను వినుకొండలో ప్రదర్శించనున్నారని చెప్పారు. జనరల్ బోగి, కిడ్నాప్ నాటిక, యువభేరి వారి నా శత్రువు, హక్కు, స్వేచ్ఛ, దేవరాగం, దొందూ.. దొందే వంటి ప్రజాదరణ పొందిన నాటికలను ప్రదర్శించబోతున్నారని వెల్లడించారు. సోమవారం నుంచి నుంచి ఈ నెల 21 వరకు రోజుకు 2నాటికల చొప్పున ప్రదర్శిస్తారని, ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. రాత్రి 7.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ నాటకోత్సవాలకు వినుకొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విచ్చేయాలని ఆహ్వానించారు. అనంతరం జీవీ సతీమణి లీలావతి మాట్లాడుతూ. తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అన్నారు. ఆయనను స్మరిస్తూ నాటకోత్సవాలు నిర్వహించడం చాలా మంచి విషయంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని, నటుడిగానే కాకుండా గొప్ప పరిపాలకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు జాతికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్లుగా భావిస్తున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సహా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు .(Story:ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వినుకొండలో నాటకోత్సవాలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version