Home వార్తలు తెలంగాణ వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

0

వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం బుద్ధారం, పొల్కే పహాడ్, గోపాల్ పేట, ఎదుట్ల, చెన్నారం వరి కొనుగోలు కంద్రాలతో పాటు చిట్యాల గోదామును అదనపు కలెక్టర్ సందర్శించారు.వరి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, తూకం చేసిన వెంటనే ధాన్యాని మిల్లులు, గోదాములకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. అకాల వర్షాలు పడుతుండటంతో వడ్లు తడచిపోకుండా టార్ఫాలిన్ కప్పాలని నిర్వాహకులను ఆదేశించారు. వడ్లకు సరైన తేమ నమోదు అయిన వెంటనే తూకం చేసి ధాన్యం మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ప్రతి కొనుగోలు కేంద్రానికి లారీలు ప్రతిరోజూ వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు నిబంధనల ప్రకారం తాలు, గడ్డి లేని నాణ్యమైన వడ్లను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులను సూచించారు. (Story:వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version