Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విద్యావేత్త, ఉపాధ్యాయులు మైఖేల్ బాబు ఆకస్మిక మృతి..

విద్యావేత్త, ఉపాధ్యాయులు మైఖేల్ బాబు ఆకస్మిక మృతి..

0

విద్యావేత్త, ఉపాధ్యాయులు మైఖేల్ బాబు ఆకస్మిక మృతి..

న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణ ప్రముఖ విద్యావేత్త ఉపాధ్యాయుడు మైఖేల్ బాబు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. గత కొన్నేళ్లుగా హృదయ సంబంధ సమస్యతో ఉన్న మైఖేల్ బాబు మంగళవారం మధ్యాహ్నం స్థానిక రైలు పేటలోని తన ఇంటి వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ కు ద్విచక్ర వాహనం పై వెళుతూ వేసవి తీవ్రతను తాళలేక క్రింద పడిపోయారు. తక్షణమే సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఒక కుమారుడు ఒక కుమార్తే ఉన్నారు. మృతుడు మైఖేల్ బాబు పేదరికంలో కష్టనష్టాలను భరిస్తూనే అత్యున్నత విద్యను అభ్యసించారు. తదుపరి మహాత్మా గాంధీ స్కూల్ పేరుతో విద్యాసంస్థల స్థాపించి గత రెండున్నర దశాబ్దాలుగా విద్యారంగా సేవలో వందలాదిమంది కి మెరుగైన విద్యను అందించారు. తదుపరి గత కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ విద్యా రంగంలో ఉపాధ్యాయుడుగా నియమితులై విద్యారంగ సేవలను కొనసాగిస్తున్నారు. మైఖేల్ బాబు మృతి వార్త తెలుసుకున్న స్థానిక ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ ప్రతినిధులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతదేహాన్ని సందర్శించిన వారిలో నారాయణ మాస్టారు,వై ల్ కిషోర్, డాక్టర్ ఇన్నారెడ్డి, భాస్కర్ రెడ్డి, లగడపాటి శ్రీనివాసరావు, ఎస్ ఎం సుభాని, స్వరూప్ శ్రీనివాసరావు, పి. గౌస్ ఖాన్,పి. ప్రభాకర్ రావు, షేక్ నబి, కె. వెంకటేశ్వరరావు, అలాగే మాల మహానాడు ప్రతినిధులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (Story:విద్యావేత్త, ఉపాధ్యాయులు మైఖేల్ బాబు ఆకస్మిక మృతి..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version