Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ యాచకుడికి అంతక్రియలు చేసిన మానవ సేవా సమితి

యాచకుడికి అంతక్రియలు చేసిన మానవ సేవా సమితి

0

యాచకుడికి అంతక్రియలు చేసిన మానవ సేవా సమితి

న్యూస్ తెలుగు /వినుకొండ  : అనాధ శవాలకు అన్ని వారై సాంప్రదాయ బద్దంగా అంతక్రియలు చేస్తూ మానవ సేవా సమితి సభ్యులు మానవత్వం చాటుకుంటున్నారు. వినుకొండ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా యాక్షిస్తూ జీవిస్తున్న ఓ అనాధ వృద్ధుడు ఆదివారం వడదెబ్బకు గురై శివయ్య స్తూపం సెంటర్ లో సొమ్మసిల్లి అపస్మారక స్థితిలో పడిపోయారు. యాచకుడి పరిస్థితిని గుర్తించిన మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు స్పందించారు. సమస్త సభ్యులను వెంటనే పిలిపించుకొని ఆ వృద్ధ యాచకుడిని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందాడు. ఎవరూ లేని అనాధ యాచకుడికి దహన సంస్కారాలు చేసేందుకు సభ్యులందరూ ముందుకు వచ్చారు. అంతక్రియలకు అవసరమైన డబ్బులు సభ్యులంతా కలసి చందా వేసుకొని సంప్రదాయబద్ధంగా దహన సంస్కారం చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా సమయంలో ఎంతోమంది అనాధ శవాలకు అంతక్రియలు చేసి వారు మానవత్వాన్ని చాటుకుని ప్రజల అభినందనలు అందుకున్నారు. శవం- శివంతో సమానమని భావించిన మానవ సేవా సమితి సభ్యులు అనాధ శవాలకు అంతక్రియలు చేస్తున్నారు. మానవ సేవా సమితి సభ్యులు మానవతా దృక్పథంతో చేస్తున్న సేవలకు ప్రజలు అభివాదం చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి చామర్తి భవాని శంకర్, సభ్యులు నాగార్జున ( డీజే ), జాబీర్, శ్రావణ కుమార్ ( బన్నీ) తదితరులు పాల్గొన్నారు.(Story : యాచకుడికి అంతక్రియలు చేసిన మానవ సేవా సమితి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version