Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు /వినుకొండ  : వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరు ఎరక్షన్ బాబు, కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.(story : ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!