Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు వ‌చ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలి

శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు వ‌చ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలి

0

శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు వ‌చ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలి

న్యూస్ తెలుగు /సాలూరు : 15 సంవత్సరాలు తర్వాత  శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ వస్తుందని, జాతరకు వచ్చిన భక్తులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు మున్సిపల్ కౌన్సిల్స్ సమావేశం మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్యామలాంబ అమ్మవారి పండుగ 15 సంవత్సరాల తర్వాత వస్తుంది కావున అమ్మవారి పండుగను చూడడానికి వచ్చిన భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రధానంగా పట్టణంలో విద్యుత్తు, త్రాగునీరు, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ మూడు శాఖల పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ కు ఆదేశాలు జారీచేసారు భక్తులకు ఆరోగ్య సమస్యలు వస్తే తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పట్టణ పరిధిలో కొన్ని వార్డులో కొళాయిలు లేని ప్రదేశాల్లో వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయలని అన్నారు. సిరిమాను తిరుగుతున్న ప్రదేశాల్లో వెంట వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పండుగ మూడు రోజులు నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని తెలిపారు. తాత్కాలిక మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజులుసాంస్కృతిక కార్య క్రమాలు సాయంత్రం సంగీత, నాట్య, జానపద కళలు జరుగుతాయి అని తెలిపారు.భక్తులు అధికంగా హాజరై అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలిని అన్నారు. ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ శోభిత ,మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కమీషనర్ కృష్ణారావు డీఎస్పీ రాంబాబు, పట్టణ సీఐ అప్పలనాయుడు వివిధ శాఖల అధికారులు శ్యామలాంబ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story:శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు వ‌చ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version