Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలి

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలి

0

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలి

కె మౌనిక, పి తేజస్విని

న్యూస్‌తెలుగు/ విజయనగరం  :కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా కే మౌనిక, పి తేజస్విని మాట్లాడుతూ  కనీస సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఎనిమిది రోజులుగా ఉద్యోగులంతా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు మేము అడుగుతున్న వేతన సవరణ అంశం కానీ, పెండింగ్ బకాయిలు కాని గొంతెమ్మ కోరికలు కాదన్నారు. 6 సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెరగలేదన్నారు. ప్రజారోగ్య వ్యవస్త లో పనిచేస్తున్న మన అందరం ఒక కుటుంబం లాగా మెలుగుతూ ఎవరు కూడా ఏ ఒక్క కేడర్ నీ అవమానించేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా, గౌరవంగా అవగాహనతో పనిచేస్తూ వ్యవస్తను బలోపేతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వి కనకదుర్గ ప్రమీల విజయలక్ష్మి పాల్గొన్నారు సమ్మెకు ఏపీజీ ఈ ఏ మద్దతు. గత ఎనిమిది రోజులుగా కలెక్టర్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు తెలియజేస్తుందని అధ్యక్షులు కె . వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బలివాడ బాల భాస్కరరావు , అన్నారు. మంగళవారం చేస్తున్న నిరసన దీక్ష వద్దకు వెళ్లి తమ మద్దతు తెలియజేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ పాణిగ్రహి, లంక సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు . (Story:కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version