విశ్వంభర నుంచి అవనిగా త్రిష కృష్ణన్ పరిచయం
త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, విశ్వంభరలోని ఆమె పాత్ర అవనిగా పరిచయం చేశారు. రాజసం ఉట్టిపడే చీరకట్టులో మెరిసిపోతు కనిపించారు త్రిష. ఈ పోస్టర్ కి ట్రమండస్ రెస్పాన్స్ వస్తోంది.
వశిష్ఠ విజన్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న విశ్వంభర పురాణ గాధలను మోడరన్ సినిమాతో బ్లెండ్ చేస్తోంది. హై క్వాలిటీ VFX, భారీ CGI బడ్జెట్, అద్భుతమైన కథ ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డిఓపి: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో (Story:విశ్వంభర నుంచి అవనిగా త్రిష కృష్ణన్ పరిచయం)

