ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూలు ఇలా..
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ/బెటర్‌మెంట్ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. రోజుకు రెండు విడతలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం విడతలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర పరీక్షలు కొనసాగుతాయి. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.
ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో సప్లిమెంటరీ పరీక్షలు రాయగోరే విద్యార్థులకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫీజు చెల్లింపు గడువునుమే 5వ తేదీ వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడిరచారు. ఇప్పటివరకు ఫీజులు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మరోసారి పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ షెడ్యూలు:
మే 12వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, మే 13నఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. మే 14న మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2, మే 15న మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజీ 2, హిస్టరీ 2 నిర్వహిస్తారు. మే 16న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్2
మే 17న కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2లు జరుగుతాయి. మే 19.న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 2 (బైపీసీ విద్యార్థులకు), మే 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2 నిర్వహిస్తారు.
ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూలు:
మే 12న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1, మే 13న ఇంగ్లీష్ పేపర్ 1, మే 14 మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 జరుగుతాయి. మే 15న మ్యాథ్స్ పేపర్ 1ఏ, జువాలజీ 1, హిస్టరీ 1, మే 16.. ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్ 1 నిర్వహిస్తారు.
మే 17న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 జరుగుతాయి. మే 19.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు), మే 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 పరీక్షలను నిర్వహిస్తారు. (Story: ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూలు ఇలా..)
Follow the Stories:
యూనియన్ బ్యాంకులో ఉద్యోగాల జాతర
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)