శావల్యాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఫించన్ లబ్ధిదారుల నిరసన
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆకారణంగా పింఛన్ కోల్పోయిన వారి తరుపున వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సూచన మేరకు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బోడేపూడి వెంకటేశ్వర్లు( కొండలు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శావల్యాపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చర్మ కళాకారులు సహా పలు ఫించన్ లబ్ధిదారులు బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు, తిరునాళ్ల సందర్భంగా తమ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభ ఏర్పాటు చేశామని, దానిని కారణంగా చూపిస్తూ పలువురి ఫించన్లు నిలిపివేశారని ఆరోపించారు. ముఖ్యంగా పోట్లూరు, పిచికలపాలెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులు దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా కొత్త ఫించన్లు మంజూరు చేయలేదు. కానీ ఉన్నవాటిని కూడా తీసివేయడం ఎంతవరకు న్యాయం?” అంటూ ప్రశ్నించారు. ఫించన్ పంపిణీదారులకు, ఎందుకు నిలిపివేశారని గ్రామ స్థాయి ఫించన్లు పంపిణి అధికారులు అడిగితే, ఎంపీడీఓ అపమన్నారని వారు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత శాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని, అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఫించన్లు పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. (Story: శావల్యాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఫించన్ లబ్ధిదారుల నిరసన)