అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది
న్యూస్‌తెలుగు/వనపర్తి : అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన వర్షానికి చిట్యాల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తడిచిపోయింది. శనివారం ఉదయం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి తడిసిన వరి ధాన్యమును పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్, పౌరసరఫరాల శాఖ అధికారులకు తడిసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రంలో గడిచిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు అవసరమైన టార్ఫాలిన్ లు అందజేయాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు (Story:అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది)