తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : శుక్రవారం రాత్రి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ నందు పరిశీలించి ప్రభుత్వం ధాన్యాని కొనుగోలు చేసేవరకు పోరాడుతామని బిఆర్ఎస్ నాయకులు రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్,రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం వచ్చిన ధాన్యాని గన్ని బ్యాగులు లేవని,ట్రాస్ఫోర్ట్ లేదని నేటి వరకు కొనుగోళ్లు చేయకపోవడం వల్ల 30వేల బస్తాలు నీటి పాలు అయినాయని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.ఈ యాసంగిలో 75లక్షల బస్తాలు మార్కెట్ యార్డ్ కు వస్తాయని అంచనా ఉన్నా పర్యవేక్షణ లేక రైతులను ఈ ప్రభుత్వం నట్టేట మంచిదని విమర్శించారు. రైతులతో కలసి దాదాపు గంటసేపు రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింపజేసి తమ నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్ తడసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,భానుప్రకాష్ రావు,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్,పిగులాం ఖాదర్ ఖాన్,సూర్యవంశం.గిరి,ఇమ్రాన్, జోహెబ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి,చిట్యాల రాము,బాబు నాయక్,పాషా,నారాయణ నాయక్,రైతులు పాల్గొన్నారు. (Story:తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్)