Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అమరావతి పునః ప్రారంభోత్సవానికి భారీగా తరలివెళ్లిన వినుకొండ  ప్రజలు

అమరావతి పునః ప్రారంభోత్సవానికి భారీగా తరలివెళ్లిన వినుకొండ  ప్రజలు

అమరావతి పునః ప్రారంభోత్సవానికి భారీగా తరలివెళ్లిన వినుకొండ  ప్రజలు

న్యూస్ తెలుగు / వినుకొండ : అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినకొండ నియోజకవర్గం నుండి శుక్రవారం ప్రజలు భారీగా తరలి వెళ్లారు. పునః ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయుచున్న సందర్భంగా మోడీ సభను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలి వెళ్లారు. ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపుమేరకు వినుకొండ నియోజకవర్గం ఐదు మండలాల నుండి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున అమరావతికి తరలి వెళ్లారు. ప్రధాని మోడి సభకు ప్రభుత్వం వినుకొండ నియోజకవర్గానికి 107 బస్సులు ఏర్పాటు చేసినా ప్రజలు ఎక్కువమంది వెల్లెందుకు ఉత్సాహం చూపి స్వచ్ఛందంగా నియోజకవర్గం నుండి సుమారు 5000 మందికి పైగా వెళ్ళటం జరిగింది. ఆయా మండలాల నుంచి బస్సుల్లో బయలుదేరిన వారికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బస్సుల వద్దకే టిఫిన్, మజ్జిగ, తాగునీరు, భోజనం సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తెలుగు జాతి గర్వించేలా, చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునర్నిర్మాణ సభ జరుగుతుందని అందుకు ఉత్సాహంగా సభకు తరలి వెళుతున్నట్లు తెలిపారు. (Story : అమరావతి పునః ప్రారంభోత్సవానికి భారీగా తరలివెళ్లిన వినుకొండ ప్రజలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!