Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో కబడ్డీ క్యాంప్ ప్రారంభం

ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో కబడ్డీ క్యాంప్ ప్రారంభం

ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో కబడ్డీ క్యాంప్ ప్రారంభం

న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ(శాప్) వారి ఆధ్వర్యంలో మే 01 నుండి మే 31 వరకు అనగా నెలరోజుల పాటు జరిగే కబడ్డీ క్యాంప్ స్థానిక కారంపూడి రోడ్డు లోని విద్యా వికాస్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నామని కబడ్డీ కోచ్ కోమటి గుంట శ్రీహరి తెలిపారు. గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ కబడ్డీ క్యాంపు కార్యక్రమానికి డిసి చైర్మన్ గంగినేని రాఘవరావు, ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రజిత్ యాదవ్, పి.ఈ.టి రాధాకృష్ణమూర్తి మరియు వినుకొండ జోన్ ప్రెసిడెంట్ గణప వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన కబడ్డీ క్రీడాకారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కె శ్రీహరి తెలిపారు. ఈ కబడ్డీ క్యాంప్ నిర్వహించుకునేందుకు తనకు సహకరించిన విద్యా వికాస్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మరింత సమాచారం కొరకు సెల్:- 80082 85430 నెంబర్ ను సంప్రదించాలని కోరారు. (Story:ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో కబడ్డీ క్యాంప్ ప్రారంభం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!