Homeవార్తలుతెలంగాణజిల్లాస్థాయి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిలకు సన్మానం

జిల్లాస్థాయి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిలకు సన్మానం

జిల్లాస్థాయి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిలకు సన్మానం

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి లో 10 Th ఇంటర్ లలో రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిలకు ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. సీనియర్ డాక్టర్ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి మనమరాళ్ళు అనన్య 578 ,అక్షయ 539 మార్కులు తెచ్చుకొని 30 వ వార్డు కే కాకుండా వనపర్తికి కీర్తి తెచ్చారని వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్కాలర్స్ కాలేజీలో ఇంటర్ విద్యార్థినిలు రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి మార్కులు తెచ్చుకుని వనపర్తికి మంచి పేరు తెచ్చి రాష్ట్రంలో ఉన్న కార్పొరేటర్ కాలేజీలు స్కూలు ముందు దిగదుడుపు అని తేల్చారు. వనపర్తి చుట్టుపక్కల తల్లిదండ్రులు కార్పొరేటర్ కాలేజీలకు మీ పిల్లలను పంపకుండా వనపర్తి లోని గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కాలేజీలో మాత్రమే చదివించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిల తల్లిదండ్రులు, స్కాలర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్,స్టాఫ్ ,సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు, కొత్త గోళ్ళ శంకర్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య ,నాగరాజు, రామస్వామి శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story:జిల్లాస్థాయి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినిలకు సన్మానం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!