కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద టిఎన్టీయూసీ కార్యాలయంలో గురువారం జరిగిన మేడే వేడుకల్లో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను సీనియర్ లాయర్ సైదారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆర్టీసీ విధులు నిర్వహిస్తు అనారోగ్యంతో బాధపడుతున్న డ్రైవర్ వేముల హరిబాబుకు మరియు బస్టాండ్ నందు స్వీపర్గా పనిచేస్తున్న కోటి లింగయ్య కు వీరికి కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. అలానే పులిహోర పంపిణీ ఎమ్మెల్యే జీవి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి.వి.నాయక్, పసుపులేటి రాఘవ, అధ్యక్షులు కొమ్మాలపాటి రమేష్ బాబు, సెక్రటరీ కోట్ల చిన్న పేరయ్య, జాయింట్ సెక్రెటరీ కృపావరదానం, వైస్ ప్రెసిడెంట్ వి.ఎస్.రావు, శివాని, వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు షకీలా దస్తగిరి, పీ.వీ. సురేష్, పత్తి పూర్ణ, అక్బర్ బాషా, చికెన్ బాబు, యూనియన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story:కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం)
