మావోయిస్టుల ఇలాఖా లో రేపరెపలాడిన త్రివర్ణ పతాకం
న్యూస్ తెలుగు/చింతూరు : చతిస్గడ్ లో మావోయిజంపై జరిగిన అతిపెద్ద పోరాటంలో భద్రత దళాలు మరో పెద్ద విజయాన్ని సాధించాయి. చతిస్గడ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బలమైన కోట అయిన కర్రగుట్ట స్వాధీనం చేసుకొని కొండపై భద్రతాళాలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశంలో మావోయిజంపై ఇప్పటివరకు తీసుకున్న అతిపెద్ద చర్య లో మొదటిది. ఈ చర్యల్లో భద్రతా దళాలు 9 రోజులుగా ఎర్రదండు కు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నాయి. ఇప్పుడు చివరి దశలో ఉందని పేర్కొంటున్నారు. మావోయిస్టులను అంతమొందించడానికి 10 నుండి 12,000 మంది సైనికులు చేరి కర్రిగుట్టను స్వాధీనం చేసుకున్నారు. టాప్ క్యాడర్ మావోయిస్టు నాయకులతో సహా వందలాదిమంది మావోయిస్టులను నిర్మూలించి వారి బంకర్లన్నిటిని కూల్చేయాలని భద్రత దళాలు సంకల్పించారు. గత మంగళవారమే కర్రిగుట్టను స్వాధీనం చేసుకుంది.హెలికాప్టర్లు సహాయంతో 500 మంది భద్రతా దళాలను ఈ ప్రాంతంలో దింపారు. ఆపరేషన్ లో చత్తీస్గడ్, తెలంగాణ పోలీసులు, పారామిలిటరీ దళాలు మాత్రమే పాల్గొన్నాయి. అదే సమయంలో బీహార్, జార్ఖండ్ నుండి కేంద్ర భద్రత సిబ్బంది కూడా కర్రెగుట్ట కు చేరుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది . మావోయిస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ లో భద్రతా దళాలు ఐదు మంది మావోయిస్టులను హత మార్చారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారి వద్దనున్న అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో కర్రిగుట్ట పర్వత ఉష్ణోగ్రత 40 నుండి 45 డిగ్రీల మధ్య ఉండటంతో చాలామంది జవాన్ల ఆరోగ్యం క్షీణించింది. ఆపరేషన్ లో సుమారు 40 మంది జవాన్లు డిహైడ్రేషన్ గురయ్యారు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు తాకి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆపరేషన్ ఇప్పట్లో ఆగదని కొనసాగుతుందని ఫోర్సు ఉన్నతాధికారులు తెలిపారు. కర్రెగుట్టను ఆనుకొని ఉన్న మరో రెండు కొండలను కోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భూపాలపట్నం వైపు ఉన్న కొండలను ఆక్రమించిన తర్వాత అక్కడ నుండి కూడా కదలిక ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ మేరకు అధికారులతో ఐబిచీఫ్ సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ కొనసాగుతుందని బ్యాకప్ కోసం ఇతర జిల్లాల నుండి కూడా బలగాలను పిలిపించాలని సమావేశంలో నిర్ణయిం చారు. (Story:మావోయిస్టుల ఇలాఖా లో రేపరెపలాడిన త్రివర్ణ పతాకం)

