Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పక్షాన పోరాడేది ఎర్రజెండాఒక్కటే..

ప్రజల పక్షాన పోరాడేది ఎర్రజెండాఒక్కటే..

0

ప్రజల పక్షాన పోరాడేది ఎర్రజెండాఒక్కటే..

న్యూస్‌తెలుగు/చింతూరు : ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని డివిజన్ నాయకులు ఎస్కే రంజాన్ అన్నారు. ,139వ మే డే సందర్భంగా చింతూరు మండల వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతూరు సెంటర్లో ఏఐ టీయూ సీ ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరించారు. అనేక గ్రామాల్లో సిపిఐ జండా ఆవిష్కరణలు నిర్వహించి సభలు సమావేశాలు జరిపారు పోరాటాలు త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులపై నేటి పాలకులు తీవ్రంగా దాడి చేస్తున్నారని విమర్శించారు.కార్మిక ప్రజా హక్కులపై కేంద్ర ప్రభుత్వం ఉన్మాదపూర్వకమైన దాడులను ప్రతిగ టించి ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం కృషి చేయటమే మేడే అమరవీరులకు ఇచ్చే నివాళులని డివిజన్ నాయకులు యస్. కే రంజాన్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా రైతులు పంటల గిట్టుబాటు ధరలు చట్టం కావాలని కార్మికులు కనీస వేతనం 26,000 కావాలని డిమాండ్ చేశారు . చదువుకునేందుకు బడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపి పరిశ్రమలు కావాలని డిమాండ్ చేశారు . కేంద్ర ప్రభుత్వం కార్మికులు రైతులపై ఆర్థిక భారాలు వేస్తుందని కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కనిపిస్తుందని విమర్శించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉందని తెలిపారు. సంక్షేమ పథకాలకు నిధులు కోత పెట్టడం ద్వారా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు తూట్లు పడుతున్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం సిపిఐ నిరంతరం పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు మేడే పోరాట స్ఫూర్తితో సిపి ఐ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు స్థానిక సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయటం ద్వారా సంపూర్ణ మద్దతు సహకారం ఉంటుందని జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు యస్ కె రంజాన్, ఏ ఐ టి యూ సి నాయకులు. కృష్ణ, రాము, సత్య నారాయణ, హరి, తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజల పక్షాన పోరాడేది ఎర్రజెండాఒక్కటే..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version