కార్మికులకు అండగ నిరంజన్ రెడ్డి
కార్మికుల సంక్షేమమే పరమావధిగా కె.సి.ఆర్ పాలన
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యములో స్థానిక రాజీవ్ చౌరస్తా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పట్టణములో బి.ఆర్.యస్ కార్మిక విభాగాలు అయిన హమాలీ,ఆటో,తోపుడు బండ్ల,చాటకూలి,దడవాయి,మత్సకార్మిక,నాయిబ్రహ్మణ,ఆర్.టి.సి కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పి.రమేష్ గౌడ్,నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,ఉంగ్లం. తిరుమల్ తదితరులు మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ,గౌరవ నిరంజన్ రెడ్డి గారు,రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అనుక్షేణం కార్మిక సంక్షేమం కోసం తపించేవారని వారికి కమ్యూనిటీ హాల్స్,వ్యక్తిగత అవసరాలు తీర్చారని అందుకే అధికారం లేకపోయినా కార్మికులు అండగా నిలిచారని అన్నారు. రాబోవు కాలములో మళ్ళీ కె.సి.ఆర్ గారు గౌరవ నిరంజన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం ఖాయమని కార్మికుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష,కార్యదర్శులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతృ నాయక్, బండారు.కృష్ణ,డ్యానియల్, ఇమ్రాన్,సూర్యవంశం.గిరి, జోహెబ్ హుస్సేన్,సయ్యద్. జెమీల్ ,నందిమల్ల. రమేష్,సునీల్ వాల్మీకి,ఎ. కే.పాషా, హారిఫ్, జె.శ్రీనివాసులు,పెద్ద ముక్కల.రవి, నీలస్వామి,కార్మిక సంఘాల నాయకులు రాములు,చంద్రయ్య,బోలెమోని.కృష్ణయ్య,అశ్విని కుమార్,తాత రాములు,యాదయ్య,తదితరులు పాల్గొన్నారు. (Story:కార్మికులకు అండగ నిరంజన్ రెడ్డి)
