పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : పింఛన్ల పంపిణీలో భాగంగా గురువారం వినుకొండ నియోజకవర్గంలోని పేరూరు పాడు గ్రామంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 4 వేలు పెంచి ప్రతినెల ఉదయం 6 గంటల నుండి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. (Story:పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి)

