Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ మైనర్ ఇరిగేషన్ కాలువ మరమ్మత్తు పనులు  మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలి

 మైనర్ ఇరిగేషన్ కాలువ మరమ్మత్తు పనులు  మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలి

 మైనర్ ఇరిగేషన్ కాలువ మరమ్మత్తు పనులు  మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలి

తాహసిల్దార్ సురేష్ నాయక్ కు మెమోరాండం

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణ సమీపలోని బ్రాహ్మణపల్లి రోడ్డు నుండి నరసరావుపేట రోడ్డు ( తార రోడ్డు ) వరకు ఒక కిలో మీటర్ కు పైగా కాలువ రెండువైపులా కంప చెట్లు పెరిగి, రహదారి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులకి అర్జీలు పెట్టిన తరువాత ఇటీవల రెండు వైపుల సర్వే చేసి హద్దులు నిర్ణయించడం జరిగింది. ఎల్ఐసి అధికారులు నాలుగున్నర లక్షలు అంచనా ఏసి పై అధికారులకు పంపామని తెలిపారు. సుదీర్ఘకాలం నుండి కాలవ మరమ్మత్తులకు నోచుకోకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని బుధవారం తాసిల్దార్ కు అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ. తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, రైతులు పగడాల చినకోటిరెడ్డి, కంఠ రంగారావు, యాదల శంకర్రావు, నిసంకి వెంకటేశ్వర్లు, గాయం చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story: మైనర్ ఇరిగేషన్ కాలువ మరమ్మత్తు పనులు  మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments