ఘనంగా అక్షయ తృతీయ ఉత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు అక్షయ తృతీయ ఉత్సవ వేడుకలు ఆలయ కార్యనిర్వాహక నిచ్చన్నదానా ప్రధాన సేవకులు జాజులు మాల్యాద్రి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల 15 నిమిషాలకు శ్రీ స్వామి అమ్మవార్లకు పంచసూక్తములతో అభిషేక కార్యక్రమం నిర్వహించి అనంతరం స్వామికి చందనోత్సవాన్ని నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వసంత ఋతువులో అక్షయ తృతీయ కార్యక్రమాన్ని శ్రీమహావిష్ణువు కి ప్రీతిపాత్రమైన వ్రతమైన జపమైన దానమైన అక్షమైన ఫలితాలను ఇస్తాయని భవిష్యత్తుల పురాణం చెబుతుంది అక్షయమంటే నాశనం లేనిది త్రేతా యుగం ఉగాదిగా పరశురామ జయంతి శ్రీహరి వరాహవతారంలో కిరణ్యకశివుడ్ని వధించిన రోజు. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ న్యాయవాది ఎక్స్ ఏ జి పి మరియు ఏపీఎస్ఆర్టీసీ టిడిపి కార్మిక పరిషత్ గౌరవ అధ్యక్షులు పొట్లూరి సైదారావు ముఖ్యఅతిథిగా పాల్గొని విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ స్లాబ్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. నిత్య అన్నదానం జరుగుతున్న ఏకైక లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, ఇటువంటి ఆశ్రమ నిర్మాణ పనులను రాబోయే రోజుల్లో క్షేత్రంగా ఆవిర్భావిస్తుందని, గిరిప్రదక్షిణ కార్యక్రమాలకు ప్రారంభ వేదికగా కూడా ఆశ్రమం ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఇక్కడ ఆలయ సేవకులు పనిచేస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా చీప్ విప్ ఎమ్మెల్యే ఆఫీస్ నుండి జీవీ రమణ, పీవీ సురేష్ ప్రత్యేకంగా పాల్గొని ఆశ్రమ నిర్మాణమునకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వారు మాట్లాడుతూ. చారిత్రాత్మకమైన ఈ దేవస్థానంలో జరుగుతున్న పనులు భవిష్యత్తులో వినుకొండ పట్టణ ప్రజలకు ఆధ్యాత్మిక సనాతన లైబ్రరీని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయంగా వారు పేర్కొన్నారు. అనంతరం అన్నదానం విచ్చేసిన భక్తులకు ఆలయ సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బద్దిక నరసింహారావు, మహిళా భక్త బృందం ఏటుకూరి కృష్ణవేణి, పిడతల రమ, జనసేన మహిళ నాయకురాలు ఉషా, సరోజనమ్మ, విష్ణుకుండి నగర్ మహిళా భక్త బృందం పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story :ఘనంగా అక్షయ తృతీయ ఉత్సవ వేడుకలు)
