Home వార్తలు తెలంగాణ కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టించిన వరంగల్ సభ

కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టించిన వరంగల్ సభ

0

కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టించిన వరంగల్ సభ

న్యూస్‌తెలుగు/వనపర్తి: వరంగల్ రజతోత్సవ సభకు కుంభమేళను తలపించే విధంగా తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ అన్నారు. నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలు,దుష్ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు,420 హామీలు అమలు పర్చలేక ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నదని విమర్శించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి పడిగాపులు కాస్తున్న కుంటి సాకులు చెప్పి ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. సభకు వచ్చిన స్పందన చూసి ప్రభుత్వం ఆటంకాలు సృష్టించిందని ట్రాఫిక్ అదుపు చేయడంలో పోలీస్ అధికారులు విఫలమైనారని దానితో 20కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ప్రజలు నానా ఇబ్బంది పడ్డారని అయిన మొక్కవోని దీక్షతో లక్షలాది తరలివచ్చి ప్రజలు కె.సి.ఆర్ కి అండగా నిలిచారని అన్నారు. నిరంజన్ రెడ్డి నాయకత్వములో స్వచ్ఛందంగా తరలివచ్చి సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశములో పట్టణ పార్టీ అధ్యక్షుడు పలుస.రమేష్ గౌడ్,మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,యువత అధ్యక్షులు సూర్యవంశం.గిరి.మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్,నీలస్వామి,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు.(Story:కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టించిన వరంగల్ సభ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version