ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్
న్యూస్ తెలుగు/అమరావతి: మూడేళ్ల డిప్లొమో పాలిటెక్నిక్ విద్య చదివిన వారికి ఇంజినీరింగ్ డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. జేఎన్టీయూ, అనంతపురం ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మే 6వ తేదీన ఏపీ ఈసెట్ పరీక్షను రెండు విడతలుగా నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు…మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఏపీ ఈసెట్ కోసం మొత్తం 110పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లోను ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 35,187 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. క్యాలి క్యులేటర్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబోమని వెల్లడిరచారు. జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు అధ్వర్యంలో పరీక్షను నిర్వమించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బి.టెక్ రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. వారంతా 2, 3, 4 సంవత్సరాలు..అనగా మూడేళ్లపాటు చదివితే బి.టెక్ డిగ్రీ వస్తుంది. ఏపీ ఈసెట్లో వచ్చిన ర్యాంకులు, రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. (Story:ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్)