Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థికి ఘన సన్మానం..

నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థికి ఘన సన్మానం..

నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థికి ఘన సన్మానం..

న్యూస్ తెలుగు /వినుకొండ : 2024-2025 సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యా వికాస్ హై స్కూల్ విద్యార్థి దత్తలూరి సైదావలి 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గం నూర్ భాషా సంఘం వారి ఆధ్వర్యంలో విద్యార్థి దత్తలూరి సైదావలి ను నూర్ బాషా సంఘం వారు దుష్యాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లాయర్ సిద్దయ్య మాట్లాడుతూ. నియోజకవర్గంలోని అలీ బాయి పాలెం గ్రామానికి చెందిన దత్తలూరి మీరావలి 10 వ తరగతి పరీక్ష ఫలితాలలో 589 మార్కులు సాధించడం జరిగిందని, అదేవిధంగా తదుపరి ఉన్నతమైన చదువులలో కూడా మంచి మార్కులు సాధించి ఉన్నతమైన జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లాయర్ షేక్. సిద్దయ్య, ఏల్చూరు మస్తాన్ , ఆర్మీ ఈశ్వరయ్య, పెద్దవరం పెద్ద కాసిం, దత్తలూరి.మీరావలి, ఎస్.కె అంజి, తదితరులు పాల్గొన్నారు.(Story:నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థికి ఘన సన్మానం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!