అసత్య ఆరోపణలకు పేటెంట్, కేరాఫ్ అడ్రెస్ వైకాపా,జగన్
యువతకు ఉద్యోగాలిచ్చే కంపెనీలకు భూములిస్తే తప్పేంటి?: జీవీ ఆంజనేయులు
మాజీ ఎమ్మెల్యే బొల్లా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : లక్షలమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించే సంస్థలకు తక్కువధరకు భూకేటాయింపులు చేస్తే తప్పేంటని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. అసత్య ఆరోపణలకు పేటెంట్, కేరాఫ్ అడ్రెస్ జగన్ అంటూ మం డి పడ్డారాయన. ఆదివారం వినుకొండ పట్టణంలో ఈ మేరకు ప్రెస్‌మీట్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చాలన్న ప్రయత్నాలు చూసి ఓర్వలేకనే ఇలాంటి దిగజారుడు ప్రచారాలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
*ప్రధాని మోదీ సభకు వేలాదిమందితో హజరు…
2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి రానున్నారు. లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్ట బోతున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వంటి అతిరథ మహారథులతో గొప్ప కార్యక్రమం జరగబోతోంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవు కాబోతున్నాం. వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లా నుంచి వేలాదిమందిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. లక్షల మందిలో ప్రధానమంత్రి సభ విజయవంతం చేయబోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణీత సమయంలో గా పూర్తి కానున్నాయి. ప్రపంచంలోనే వినూత్నంగా చంద్రబాబు తీర్చిదిద్దబోతున్నారు.
*99పైసలకే భూకేటాయింపులు పచ్చి అబద్ధం:..
విశాఖ కేంద్రగా టీసీఎస్ ద్వారానే రూ. 1370కోట్ల పెట్టుబడులు, 12వేలమందికి ఉద్యోగాలు రాబోతున్నాయన్న చీఫ్‌విప్ జీవీ ఉరుసు కంపెనీకి 99పైసలకే భూకేటాయింపులన్న వైకాపా విమర్శల్ని ఖండించారు. రూ. 50లక్షల చొప్పున 56 ఎకరాలు, రూ. కోటి చొప్పున 3.5ఎకరా లు ఇచ్చిన వాస్తవాలు దాచి జగన్ అండ్ కో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఇదే జగన్ వైకాపా అయిదేళ్ల పాలనలో కొత్త పరిశ్రమలు ఎందుకు రాలేదో, ఉన్న పరిశ్రమలు ఎందుకు పారిపోయాయో కూడా చెప్పాలని నిలదీశారు.
*జగన్ అంటే నాకేంటి… చంద్రబాబు అంటే ప్రజలకేంటి…
గత తెలుగుదేశం ప్రభుత్వంలో తలపెట్టిన లూలూ, టెంపుల్‌టన్, అమర్‌రాజా విస్తరణలు జగన్ వచ్చాక ఎందుకు ఆగిపోయాయో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ దోపిడీ వేధింపులు, అరాచకాలు, లంచాలకు తాళలేకనే అవన్నీ తరలిపోయాయన్నారు. పెట్టుబడులు పెడతామంటే నాకేంటని అడిగే జగన్‌కు, ఆ పరిశ్రమలు వస్తే ఎంతమందికి ఉపాధి వస్తుందని ఆలోచించే చంద్రబాబుకు పోలిక ఎక్కడని చురకలు వేశారు. ఆ పరిస్థితిని మార్చి గడువు పెట్టి మరీ ఉపాధినిచ్చే సంస్థలకు భూ కేటాయింపులు చేస్తే దానిని కూడా రాజకీయం చేయడం శోచనీ యమన్నారు.
*మద్యం కుంభకోణం బడాబాసులు జైలుకే..
వైకాపా ఆరోపణలకు కౌంటర్లో భాగంగా మద్యం కుంభకోణంపైనా ఘాటుగా స్పందించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిని పట్టుకుంటే జగన్ మద్యం కుంభకోణం వాస్తవాలన్నీ వెలుగులో కి వస్తున్నాయన్నారు. దిల్లీలో జరిగిన దానికంటే ఏపీలో 10రెట్ల పెద్దదిగా జగన్ ఏలు బడిలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అక్రమాలు జరిగాయన్నారు. వారి దోపిడీ కోసమే పెద్దబ్రాండ్లను రాకుండా చేసి మరీ వేల కోట్లు కమీషన్లుగా దండుకున్నారన్నారు. ఆ ముసుగులో లక్షల కోట్లు దోచుకున్నందుకు మూల్యం చెల్లించక తప్పదు. ఈ వెనక ఉన్న వారందరు ఆధారాలతో సహా బయటకు రావడం, జైలుకు పోవడం ఖాయన్నారు.
*దాడులపై బొల్లా రివర్స్ ప్రచారాలు…..
కూటమి ప్రభుత్వంపై, తనపై వ్యక్తిగతంగా బురద జల్లాలని చూస్తున్నారంటూ స్థానిక మాజీ ఎమ్మె ల్యే బొల్లా బ్రహ్మనాయుడిపైనా ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. కొచ్చెర్ల లో జనసేన వారిపై దాడి జరిగితే రివర్స్‌లో ప్రచారం చేస్తున్నారన్నారని, బొల్లాపల్లి, బొమ్మరాజు పల్లి తండాలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడి జరిగింది, దెబ్బలు తగిలింది వాస్తవం కాదా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో అవేం చెల్లవన్నారు. వర్గపోరాటాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని, పోలీసులు ఉక్కుపాదంతో అణిచి వేస్తా రన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తే రౌడీషీట్లు కూడా తెరుస్తారని హెచ్చరించారు.
*పేదల ఇళ్లస్థలాల పేరిట రూ.14కోట్లు దోచుకున్న బొల్లా..
వైకాపా అయిదేళ్లలో వినుకొండ నియోజకవర్గాన్ని పంచుకుని మరీ దోచుకున్న బొల్లా ముఠా పేదల ఇళ్లస్థలాలను కూడా వదల్లేదని, ఆ ఉసురు తగిలే మట్టిగొట్టుకుని పోయారన్నారు. రేషన్ బియ్యం, మద్యంషాపుల్లో అడ్డగోలుగా దోపిడీ చేసింది కాక ఊరుకు 7 కి.మీ. ఆవల సొంత భూమినే అడ్డదారుల్లో పేదలకు అంటగట్టి రూ.14కోట్లు బొల్లా జేబుల్లో వేసుకున్నారని, అలాంటి వ్యక్తి మేక వన్నెపులిలా మాట్లాడడం తగదన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చి తెస్తాను అన్న వంద పడకల ఆస్పత్రికి కనీసం నిధులు తేలేక శంకుస్థాపన కూడా చేయని దద్దమ్మలు తన గురించి మాట్లాడడం శోచనీయమన్నారు.
ఒక్క రూపాయి అవినీతిని నిరూపించగలరా..
ఇదే సమయంలో తనపై, తమ కుటుంబంపై, తమ శివశక్తి ఫౌండేషన్‌పై మాజీ ఎమ్మెల్యే బొల్లా చేస్తున్న ఆరోపణల్లో ఒక్కదానిని నిరూపించగలరా? ఆధారాలు చూపగలరా అని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు గ్రామల్లో శాంతిభద్రతలు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తుంటే బొల్లా మాత్రం పసలేని సోది మాటల చెబుతున్నారన్నారు. ప్రభుత్వ డిస్పెన్సరీలో మందులు అమ్ముకుంటున్నారని చేసిన ఆరోపణలపై ఒక్క ఆధారం చూపిస్తే తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవడమే తమ విధానమన్నారు. ఇదే సమయంలో ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతికమిటీ వేసి, విశ్రాంత జడ్జిలతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పల్నాడు జిల్లా లో ఫ్యాక్షన్ అన్నది కంటికి కనిపించకుండా పోయేలా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, ఆయుబుఖాన్, పెమ్మసాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.(Story : అసత్య ఆరోపణలకు పేటెంట్, కేరాఫ్ అడ్రెస్ వైకాపా,జగన్
)