Homeవార్తలుతెలంగాణమిల్లులకు వచ్చిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దించుకోవాలి

మిల్లులకు వచ్చిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దించుకోవాలి

మిల్లులకు వచ్చిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దించుకోవాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : మిల్లులకు వచ్చిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు దింపుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం ఘనపూర్ మండలంలోని సోలీపూర్ గ్రామ సింధు ట్రేడర్ ను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నుండి పంపించిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు దించుకొని ట్రక్ షీట్ పై సంతకం చేసి పంపించాలని సూచించారు. అదేవిధంగా వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సకాలంలో ఎఫ్. సి.ఐ. కి పాటించాలని సూచించారు. అనంతరం చిట్యాల మార్కెట్ యార్డు గోదాములు సందర్శించారు. గోదాములకు వస్తున్న ధాన్యం త్వరగా దించుకొని లారీలను పోయించాలని ఆదేశించారు.(Story :మిల్లులకు వచ్చిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దించుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments