మలేరియా దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన ఐ టి డి ఏ పి ఓ
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు ఐటీడీఏ , ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్, ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఐ టి డి ఎ నుండి చింతూరు మెయిన్ సెంటర్ వరకు కొనసాగినది.ఈ ర్యాలీ ని ఉద్దేశించి ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ మాట్లాడుతూ.. మలేరియా రహిత సమాజమే ప్రపంచ మలేరియా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం అని తెలియ చేసినారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దోమ తెరలు వాడాలని, ఇంటి చుట్టూ మురుగు నీరు నిల్వలు లేకుండా చూడాలని, ప్రతీ శుక్రవారం డ్రై డే ని పాటించాలని, తెలియచేసినారు.
చింతూరు డివిజన్ లో మలేరియా కేసుల నమోదు గత సంవత్సరం 2023లో 591 కేసులు, 2024 లో 382 కేసులు ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 20 వరకు 170 కేసులు నమోదయినవి అని తెలియ చేసినారు.
ఈ మలేరియా కేసుల నియంత్రణ చర్యలలో భాగంగా మొదటి విడత దోమల మందు పిచికారీ కార్యక్రమం ఏప్రిల్ 15 వ తేదీ నుండి జూన్ 15వరకు ఉంటుందని, ఈ సంవత్సరం మలేరియా తీవ్రత అధికంగా ఉన్న 192 గ్రామాలను గుర్తించి దోమల మందు పిచికారీ కార్యక్రమం అమలు చేయాలని తెలియచేసినారు. దోమల మందు పిచికారీ ఏప్రిల్ 15 వ తేదీ నుండి ఈ రోజు వరకు 44 గ్రామాలలో పిచికారీ చేయడం జరిగినది. కావున ప్రజలందరూ తప్పకుండా దోమల మందు పిచికారీ ప్రతీ ఇంట్లో ప్రతీ గది లోపల చేయించు కోవాలని మన ప్రాంతంలో దోమలు పుట్టకుండా, కుట్ట కుండా జాగ్రత్తలు పాటించాలని తెలియచేసినారు.ఈ ర్యాలీ లో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ పుల్లయ్య , తులసిపాక వైద్యాధికారి డాక్టర్. నిఖిల్ , ఐసిడిఎస్ సూపెర్వైజర్స్, ఎ యన్ యం, హెల్త్ అసిస్టెంట్స్, అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.(Story : మలేరియా దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన ఐ టి డి ఏ పి ఓ )

