Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం ధ్యేయం

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం ధ్యేయం

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం ధ్యేయం

న్యూస్ తెలుగు/సాలూరు : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం ధ్యేయమని. ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం సాలూరు పట్టణం, 26వ వార్డు లో పైలట్ వాటర్ స్కీమ్‌ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పైలట్ వాటర్ స్కీం కొళాయిని ట్రాప్ తిప్పి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలకు త్రాగునీరు అందించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పట్టణంలో అన్ని వార్డుల్లో ఉన్న ప్రజలకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో విద్యుత్తు, రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మ తిరుపతిరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మది శ్యామల, బలగ మంగమ్మ, వాడాడ శోభారాణి , గౌడు రమణ, రెడ్డి ధర్మారావు, వడ్డీ కృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మంత్రివర్యులకు ఘనంగా సన్మానించి, ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story :ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం ధ్యేయం) 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!