Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ టెన్త్ లో బాలిక‌ల‌దే హ‌వా

టెన్త్ లో బాలిక‌ల‌దే హ‌వా

0

టెన్త్ లో బాలిక‌ల‌దే హ‌వా

81.14 శాతం పాస్‌

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విడుదల

న్యూస్‌ తెలుగు/అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 23వ తేదీ బుధవారం వెల్లడయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. ఈ ఫలితాల్లో బాలికలే సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత పొందారు.
2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఈ సారి 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్‌ మీడియానికి సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత పొందారు. 1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత. పార్వతీపురంమన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత. 19 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే అతి తక్కువ ఉత్తీర్ణత 47.64 శాతం నమోదు చేసింది. మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏప్రిల్‌ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్‌ 9వ తేదీతో ముగిసింది. కేవలం ఏడు రోజుల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష మూల్యాంకనం ముగించి త్వరిత గతిన ఫలితాలను వెల్లడిరచారు.
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ యాప్‌లోనూ విద్యార్థులు ఫలితాల్ని అందుబాటులో ఉంచారు. మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009కు ‘హి’ అని మెసేజ్‌ చేసి, విద్యా సేవల ఆప్షన్‌ ఎంచుకున్న తర్వాత పదో తరగతి పరీక్షల ఫలితాల ఆప్షన్‌ వస్తుంది. హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే చాలు, ఫలితాలను పీడీఎఫ్‌ కాపీ రూపంలో క్షణాల్లో పొందుతారు. కొందరు విద్యార్ధులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే, అలాంటి వారు రీకౌంటిగ్‌, రీవెరిఫికేషన్‌కు ఈ కింది విధంగా దరఖాస్తు చేసుకుని మార్కులు పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. (Story:టెన్త్ లో బాలిక‌ల‌దే హ‌వా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version