జిల్లాలో ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ విచారణ చేయాలి
బోగస్ మస్తర్ లతో అవి నీతి
ఉపాధి భృతిగా ప్రతికూలికి ఏడాదికి రూ 12 వేలు అందించాలి .
ఎండలు తీవ్ర దృష్ట్యా పనులు వద్ద మజ్జిగ సరఫరా చేయాలి
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు
న్యూస్ తెలుగు/చింతూరు : ఉపాధి భృతిగా ప్రతికూలికి ఏడాదికి రూ 12 వేలు అందించాలని జిల్లా లో జరుగుతున్న ఉపాధి పనులు అవనితీ పై జిల్లా కలెక్టర్ విచారణ చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు కోరారు.మంగళవారం ఉదయం 7 గంటల నుంచి బీకేఎం యు జిల్లా కమిటీ రూరల్ ప్రాంతం తొర్రూడు కోలమూరు, బొమ్మూరు తదితర ప్రాంతాల్లో ఉపాధి పనులు చేస్తున్న కార్మికుల వద్ద కు వెళ్లి పనుల్లో జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు వారు కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్ లు దొంగ మస్త్ రులు వేస్తున్నారని తెలిపారు .ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… జనవరి 20 తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ. 49 కోట్లు ఉన్న బకాయిలను చెల్లించాలన్నారు. ఉపాధి హామీ చట్టంలో ఉన్న సమ్మర్ అలవెన్స్ 2021 నవంబర్ నుంచి ఇవ్వడం లేదన్నారు. ఉపాధి హామీ సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరణ చేయాలన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ప్రతి కూలీకి పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉపాధి హామీపనులపై విచారణ చేయాలని మన జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలకు పాల్పడం జరిగిందన్నారు. , ఇదే అదునుగా చూసుకొని జిల్లాలో 10 మండలాలలో 78గ్రామాలలో 457 పనులు 2757 మంది కూలీలు పనులు చేసినట్లు పాత పనులు వద్ద ఫోటోలు తీసి ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి నేషనల్ మొబైల్ మోనిటరింగ్ సిస్టం వెబ్ సెట్టులో నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము కొన్ని గ్రామాలలో మా సంఘం ద్వారా విచారించగా ఎక్కడ పనులు జరగలేదన్నారు . పాత పనుల వద్ద ఫోటోలు తీసి బోగస్ మాస్టర్లు వేయడం జరుగుతున్నది, అని మా దృష్టికి రావడం జరిగిందన్నారు. బోగస్ మాస్టర్లు వేసినటువంటి వారి పైన చర్యలు తీసుకొని ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు జరగకుండా ఉపాధి కూలీల పొట్ట కొట్టకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధికూలీలు పనులు చేసే చోట మౌళికవసతులైన మెడికల్ కిట్టు అందుబాటులో వుంచి ఎండ నుండి ఉ పశమనం పొందడానికి నీడ సౌకర్యం మరియు ఒ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని జిల్లా అధికారులకు చూపించారు. ఈ కార్యక్రమలో బీకేఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి తోట లక్ష్మణ్, టి నాగేశ్వరావు, మరియమ్మ సురేష్ రాజు, అంజులమ్మ తదితరులు హాజరయ్యారు. (Story: జిల్లాలో ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ విచారణ చేయాలి)