ఏప్రిల్ 25న ”హలో బేబీ”
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ అనే సినిమా తెరకెక్కింది. ఒక్క క్యారెక్టర్ తో హ్యాకింగ్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
రమణ కె సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుకుమార్.పి సంగీతం అందించారు. సాయిరాం తాటిపల్లి ఈ సినిమాకు ఎడిటర్. సరికొత్త కాన్సెప్ట్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకల్లో హలో బేబీ సినిమాలో నటించిన కావ్య కీర్తి నటనకు గాను పురస్కార్ నంది అవార్డు దక్కింది. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ.. పలువురు ప్రముఖుల చేతుల మీదుగా కీర్తి కావ్య ఈ అవార్డు అందుకుంది. (Story:ఏప్రిల్ 25న ”హలో బేబీ”)