వినుకొండలో దగ్గుపాటి పురందేశ్వరి జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు అయిన దగ్గుపాటి పురందేశ్వరి జన్మదినం సందర్భంగా వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో బిజెపి నాయకుల నారిశెట్టి మహేష్, జిల్లా బిజెపి సభ్యురాలు పోలా మరియమ్మ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ మరియు వినుకొండ మాచర్ల ఇంచార్జ్ మేడం రమేష్ హాజరై కేక్ కట్ చేసి అందరికీ స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ. పురందేశ్వరి కేంద్ర మంత్రిగా ఎంపీగా పనిచేసి ప్రజల మన్నలను ఉంది పురందేశ్వరి ఈ రాష్ట్ర ప్రజలు ఆమె సేవలు గుర్తించి మరల రాజమండ్రి నుంచి పార్లమెంట్ సభ్యులుగా మూడు లక్షల పై చిలుకుమెజార్టీతో గెలిపించారని రమేష్ అన్నారు. పురందేశ్వరి భవిష్యత్తులో కేంద్రంలో అనేకమైన ఉన్నత పదవులు పొందాలని దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శావల్యాపురం మండలం నుంచి శివాజీ వెంకయ్య పత్తి మణికంఠ నాయుడు, మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి రాంబాబు, అచ్చయ్య, పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు ఎండ్లూరి వీరయ్య, వెంకటేశ్వర నాయక్, లక్ష్మీనారాయణ, ఎలమంద, మారిశెట్టి మహేష్, పట్టణ బిజెపి నాయకులు సురభి, మహేష్, పోల మరియమ్మ తో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.(Story:వినుకొండలో దగ్గుపాటి పురందేశ్వరి జన్మదిన వేడుకలు)