యువకుల మృతదేహాలు శబరి నదిలో లభ్యం
మూడు రోజులకు బయటపడ్డ దేహాలు
ఒక్కసారిగా మిన్నంటిన ఆత్మీయుల బంధువుల రోదనలు
యువకులు అంతిమయాత్రలో ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్
న్యూస్‌తెలుగు/చింతూరు : మండలంలోని కల్లేరు గ్రామపంచాయతీ సీలేరు నదిలో ఆదివారం విహారయాత్ర కని వెళ్లి నీటిలో గల్లంతైన నాగులపల్లి దిలీప్, శ్రీనివాసుల మృతదేహాలు మూడు రోజుల తర్వాత గుర్తు పట్టని విధంగా శబరి నదిలో లభ్యమైనాయి. ఎన్ డి ఆర్ ఎఫ్, పోలీసు బృందాలు మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినారు. కడసారి చూపు కోసం కన్నవారు ఆత్మీయులు స్నేహితులకు మంగళవారం ఉదయం విగత జీవులుగా శబరి నదిలో యువకుల మృతదేహాలు దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా రోధనలు మిన్నంటాయి. నిత్యం తమ మధ్యన ఉంటూ సరదాలు షికార్లు చేసి సంతోషంగా గడిపే మిత్రులు భయానకంగా మృతదేహాలుగా మారి కనిపించడంతో తోటి వారు గుండెలవిసేలా విలపించారు. బాధిత రెండు కుటుంబాల్లో ఒక్కరే మగసంతానం కావడంతో వారి దుఃఖాన్ని ఆపే ప్రయత్నం ఎవరికి సాధ్యపడలేదు. అనంతరం మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
యువకుల అంతిమయాత్రలో ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ పాల్గొన్నారు.యువకులు గల్లంతైన రోజు నుండి మూడవ రోజు వరకు అధికార యంత్రాంగం తో పాటుగా జమాల్ ఖాన్ తన సిబ్బందితో నాటు పడవలను ఏర్పాటు చేసుకొని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలు లభ్యమైన వెంటనే ప్రభుత్వ వైద్యులను సిబ్బందిని ఫోన్లో సంప్రదించి పంచనామా వెంటనే జరిగేలా చూడాలని తెలిపారు. అధికారులను అప్రమత్తం చేసి మృతదేహాలు ఎక్కువసేపు ఉండకుండా త్వరగా కార్యక్రమం పూర్తి చేయవలసిందిగా కోరినారు. వారికి కావలసిన అంతిమ సంస్కారాలకు తన జెసిబి సహాయంతో సమాధులను తవ్వించి దగ్గర ఉండి కార్యక్రమాన్ని నిర్వహించారు. (Story:యువకుల మృతదేహాలు శబరి నదిలో లభ్యం)