విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ
న్యూస్ తెలుగు/సాలూరు : ప్రత్యేక అవసరాలు విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు (చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్. సి డబ్ల్యూ ఎస్ ఎన్- ) ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విభాగాల వారికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలు తమ సామర్థ్యాలను చూపించేందుకు అవసరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ పరికరాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, విద్యాభ్యాసంలో మరింత ఆసక్తిని కలిగిస్తాయి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో దృష్టి లోపం, శారీరక వైకల్యం, వాద్య వినికిడి లోపం వంటి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వీలు కలిగే విధంగా తయారు చేసిన ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణారావు, సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు పరమేష్, ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, కౌన్సిలర్లు వైదేహి, తర్లాడ లక్ష్మీజీ, వైకుంఠపు హర్ష వర్ధన్, తదితరులు పాల్గొన్నారు, (Story:విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ)